ETV Bharat / offbeat

అన్నం వండేంత టైమ్​లోనే "దాల్ బిర్యానీ" రెడీ - పిల్లల లంచ్ బాక్స్​కు సూపర్ ఆప్షన్! - DAL BIRYANI RECIPE

- ఇలా ప్రిపేర్​ చేస్తే ఇష్టంగా లాగిస్తారు

Dal Biryani Recipe
How to Make Dal Biryani Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 17, 2024, 3:03 PM IST

How to Make Dal Biryani Recipe : చాలా మంది అమ్మలు పిల్లల లంచ్​ బాక్స్​ కోసం ఎప్పుడూ రకరకాల రెసిపీలు ట్రై చేస్తుంటారు. ఎందుకంటే మామూలుగా వైట్​ రైస్​, కర్రీ బాక్స్​లో పెడితే పిల్లలు ఇష్టంగా తినరు. అందుకే ఈసారి ఘుమఘుమలాడే 'దాల్​ బిర్యానీ' ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ స్టోరీలో చెప్పిన విధంగా ​చేస్తే.. రుచికరమైన దాల్​ బిర్యానీ ఇట్టే తయారైపోతుంది. కాస్త స్పైసీగా ఉండే ఈ బిర్యానీ పిల్లలకు నచ్చుతుంది. ఇక ఆలస్యం చేయకుండా టేస్టీ దాల్​ బిర్యానీ ఎలా చేయాలో ఓ లుక్కేయండి..

కావాల్సిన పదార్థాలు :

  • శనగపప్పు-1 కప్పు
  • బాస్మతి బియ్యం-3 గ్లాసులు
  • బంగాళదుంపలు-2
  • ఉల్లిపాయలు-3
  • పచ్చిమిర్చి-4
  • ఉప్పు రుచికి సరిపడా
  • పసుపు-పావు టీస్పూన్
  • అల్లం, వెల్లుల్లి పేస్ట్-టేబుల్​స్పూన్
  • పెరుగు-అరకప్పు
  • కొత్తిమీర, పుదీనా తరుగు-కొద్దిగా
  • కారం-టీస్పూన్​
  • బిర్యానీ ఆకులు-3
  • దాల్చిన చెక్క-2
  • లవంగాలు-5
  • మిరియాలు-6
  • యాలకులు-2
  • షా జీరా- పావు టీస్పూన్
  • గసగసాలు-కొద్దిగా
  • నూనె

తయారీ విధానం :

  • ముందుగా శనగపప్పు నీటిలో నానబెట్టుకోండి. అలాగే బియ్యం కూడా కడిగి నీటిలో అరగంటపాటు నానబెట్టుకోండి.
  • తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలను నిలువుగా కట్​ చేసుకోండి. ఆపై ఆలుగడ్డల పైన పొట్టు తీసేసుకుని పెద్ద ముక్కలుగా కట్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు బిర్యానీ చేయడం కోసం.. స్టౌపై గిన్నె పెట్టి 4 టేబుల్​స్పూన్ల ఆయిల్​ వేయండి. నూనె వేడయ్యాక కట్​ చేసిన ఆనియన్స్​ వేసి బ్రౌన్​ కలర్​ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి.
  • తర్వాత వేగిన ఉల్లిపాయలను ఒక ప్లేట్లోకి తీసుకోండి.
  • ఇప్పుడు మరో గిన్నెలో 2 స్పూన్ల ఆయిల్​ వేసి వేడి చేయండి. ఆపై బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, గసగసాలు వేసి కాసేపు ఫ్రై చేయండి.
  • ఇప్పుడు.. కట్​ చేసిన పచ్చిమిర్చి, పొటాటో ముక్కలు యాడ్​ చేయండి. కొద్దిసేపు కలుపుకుని మూతపెట్టండి.
  • 5 నిమిషాల తర్వాత.. నానబెట్టుకున్న శనగపప్పు వేసి కలపండి.
  • శనగపప్పు పచ్చివాసన పోయే వరకు 3 నిమిషాలు మగ్గించుకోండి. ఆపై కొత్తిమీర, పుదీనా తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేయండి.
  • మసాలా మిశ్రమం బాగా కలిపి మూతపెట్టండి. 3 నిమిషాల తర్వాత.. ఇందులో పెరుగు వేసి బాగా కలపండి.
  • ఆపై ఫ్రై చేసుకున్న బ్రౌన్​ ఆనియన్స్​ కొన్ని వేసి కలపండి. ఇప్పుడు ఆరు గ్లాసుల నీటిని పోసుకోండి. (ఈ బిర్యానీ కోసం గ్లాసు రైస్​కి.. గ్లాసున్నర నీటిని యాడ్​ చేయాలి)
  • ఇప్పుడు బాగా మిక్స్​ చేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోండి.
  • శనగపప్పు, పొటాటో ముక్కలు 80 శాతం ఉడికిన తర్వాత.. బాస్మతి రైస్​ వేసి మెల్లిగా కలుపుకోండి. (మీరు బాస్మతి బియ్యానికి బదులుగా మామూలు రైస్​ కూడా ఉపయోగించవచ్చు)
  • ఇప్పుడు మిగిలిన ఫ్రై చేసిన ఆనియన్స్ వేసి..​ మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోండి.
  • ఆ తర్వాత మెల్లిగా అడుగు భాగం నుంచి ఒకసారి కలుపుకోండి. ఆపై మూతపెట్టి మరో 5 నిమిషాలు ఉడికించుకుని స్టౌ ఆఫ్​ చేయండి.
  • అంతే.. ఇలా సింపుల్​గా చేసుకుంటే ఘుమఘుమలాడే దాల్​ బిర్యానీ ముందుంటుంది.
  • నచ్చితే ఈ విధంగా దాల్​ బిర్యానీ ఇంట్లో ట్రై చేయండి.

దసరా స్పెషల్​ - వెజ్​ లవర్స్​ కోసం అద్దిరిపోయే "పనీర్​ మొఘలాయ్​ దమ్​ బిర్యానీ" - ఇలా ట్రై చేయండి!

శాఖాహారులకు అద్దిరిపోయే హైదరాబాదీ 'క్యాప్సికం దమ్ బిర్యానీ' - మస్తు మజాగా ఉంటుంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.