Best Cars Under 5 Lakh : ప్రస్తుత కాలంలో ఫ్యామిలీతో కలిసి వెళ్లాలంటే కారు తప్పనిసరి అయిపోయింది! ఎందుకంటే బైక్‌పై ఇద్దరు లేదా ముగ్గురు కంటే ఎక్కువ మంది వెళ్లలేరు. అందుకే చిన్న బడ్జెట్లో మంచి కారు కొనాలని చాలా మంది ఆశపడుతుంటారు. ఇలాంటి వారి కోసం ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో రూ.5 లక్షల బడ్జెట్లో మంచి కార్లు లభిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. Maruti Suzuki Alto 800 Specifications : మారుతి సుజుకి ఆల్టో 800 కారు ఐదు వేరియంట్లు, ఆరు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. ఈ మోడల్ కార్లు వేరియంట్లను బట్టి లీటరుకు 24.7 కి.మీ - 31.4 కి.మీ మైలేజ్‌ను ఇస్తాయి. మారుతి సుజుకి ఆల్టో 800 కారు ధర మార్కెట్లో రూ.3.54 - రూ.5.13 లక్షల వరకు ఉంటుంది.
- ఇంజిన్ - 796 సీసీ
- ఫ్యూయల్ టైప్ - పెట్రోల్, పెట్రోల్+సీఎన్జీ
- మైలేజ్ - 24.7 - 31.4 kmpl
- మ్యాక్స్ టార్క్ - 60,69 Nm
- మ్యాక్స్ పవర్ - 40,47 bhp
- ట్రాన్స్ మిషన్ - మాన్యువల్
- బూట్ స్పేస్ - 177 లీటర్లు
2. Maruti Suzuki Alto K10 Specifications : మారుతి సుజుకి ఆల్టో కే10 కారు 8 వేరియంట్లు, ఆరు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. ఈ మోడల్ కారు లీటరుకు 27 కి.మీ మైలేజ్‌ను ఇస్తుంది. మారుతి సుజుకి ఆల్టో కే 10 మోడల్ కారు ధర రూ.3.99 - రూ.5.96 లక్షల వరకు ఉంటుంది.
- ఇంజిన్ - 998 సీసీ
- ఫ్యూయల్ టైప్ - పెట్రోల్, పెట్రోల్+సీఎన్జీ
- మైలేజ్ - 27 kmpl
- మ్యాక్స్ టార్క్ - 82,89 Nm
- మ్యాక్స్ పవర్ - 55,66 bhp
- ట్రాన్స్మిషన్ - మాన్యువల్, ఆటోమేటిక్
- బూట్ స్పేస్ - 214 లీటర్లు
3. Maruti Suzuki S-Presso Specifications : మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కారు 8 వేరియంట్లు, ఆరు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. ఈ మోడల్ కార్లు వేరియంట్లను బట్టి లీటరుకు 24.8 కి.మీ - 32.7 కి.మీ మైలేజ్‌ను ఇస్తాయి. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కారు ధర మార్కెట్లో రూ.4.27 - రూ.6.12 లక్షల వరకు ఉంటుంది.
- ఇంజిన్ - 998 సీసీ
- ఫ్యూయల్ టైప్ - పెట్రోల్, పెట్రోల్+సీఎన్జీ
- మైలేజ్ - 24.8 - 32.7 kmpl
- మ్యాక్స్ టార్క్ - 82,89 Nm
- మ్యాక్స్ పవర్ - 56,66 bhp
- ట్రాన్స్మిషన్ - మాన్యువల్, ఆటోమేటిక్
- బూట్ స్పేస్ - 240 లీటర్లు
4. Bajaj Qute Specifications : బజాజ్ క్యూట్ కారు 2 వేరియంట్లు, నాలుగు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. ఈ మోడల్ కార్లు వేరియంట్ లను బట్టి లీటరుకు 35 కి.మీ - 43 కి.మీ మైలేజ్‌ను ఇస్తాయి. బజాజ్ క్యూట్ కారు ధర మార్కెట్లో రూ.2.64 - రూ.2.84 లక్షల వరకు ఉంటుంది. తక్కువ బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే కారు కొనాలకునేవారికి బజాజ్ క్యూట్ మంచి ఆప్షన్ అవుతుంది.
- ఇంజిన్ - 217 సీసీ
- ఫ్యూయల్ టైప్ - పెట్రోల్, పెట్రోల్+సీఎన్జీ
- మైలేజ్- 35 - 43 kmpl
- మ్యాక్స్ టార్క్ - 16,19 Nm
- మ్యాక్స్ పవర్ - 11,13 bhp
- ట్రాన్స్మిషన్ - మాన్యువల్
5. Hyundai Santro Specifications : హ్యుందాయ్ శాంట్రో కారు 9 వేరియంట్లు, ఐదు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. ఈ మోడల్ కార్లు వేరియంట్లను బట్టి లీటరుకు 20.3 కి.మీ - 30.6 కి.మీ మైలేజ్‌ను ఇస్తాయి. హ్యుందాయ్ శాంట్రో కారు ధర మార్కెట్లో రూ.4.87 - రూ.6.45 లక్షల వరకు ఉంటుంది.
- ఇంజిన్ - 1086 సీసీ
- ఫ్యూయల్ టైప్ - పెట్రోల్, పెట్రోల్+సీఎన్జీ
- మైలేజ్ - 20.3 - 30.5 kmpl
- మ్యాక్స్ టార్క్ - 86,99 Nm
- మ్యాక్స్ పవర్ - 59,69 bhp
- ట్రాన్స్ మిషన్ - మాన్యువల్, ఆటోమేటిక్
6. Renault Kwid Specifications : రెనో క్విడ్ కారు 7 వేరియంట్లు, 6 కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. ఈ మోడల్ కార్లు వేరియంట్లను బట్టి లీటరుకు 22 కి.మీ - 23 కి.మీ మైలేజ్‌ను ఇస్తాయి. రెనో క్విడ్ కారు ధర మార్కెట్లో రూ.4.70 - రూ.6.33 లక్షల వరకు ఉంటుంది.
- ఇంజిన్ - 999 సీసీ
- ఫ్యూయల్ టైప్ - పెట్రోల్
- మైలేజ్ - 22 - 23 kmpl
- మ్యాక్స్ టార్క్ - 91 Nm
- మ్యాక్స్ పవర్ - 67 bhp
- ట్రాన్స్మిషన్ - మాన్యువల్, ఆటోమేటిక్
- బూట్ స్పేస్ - 300 లీటర్లు
గతుకుల రోడ్లపై కూడా దూసుకుపోవాలా? ఈ టాప్-10 బైక్స్‌పై ఓ లుక్కేయండి! - Best Off Road Bikes