ETV Bharat / state

'ధాన్యం కొనుగోలులో స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వండి' - సంగారెడ్డి తాజా వార్తలు

ధాన్యం కొనుగోలు విషయంలో స్థానికులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి జాయింట్ కలెక్టర్ వీరారెడ్డికి ఫోన్​ద్వారా సూచించారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం సోలక్పల్లిలో పర్యటించిన ఆయన రైతులకు జీలుగు విత్తనాలు పంపిణీ చేశారు.

Telangana news
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన
author img

By

Published : May 21, 2021, 2:48 PM IST

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి పర్యటించారు. సోలక్పల్లిలో రైతులకు జీలుగు విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం గుమ్మడిదలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం ఎక్కువగా నిల్వ ఉండిపోవడం చూసి ఎమ్మెల్యే ఆరా తీశారు. వనపర్తి నుంచి తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని... అందువల్లే స్థానికంగా ధాన్యం నిల్వ ఉండిపోతుందని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సమస్యపై జేసీ వీరారెడ్డికి ఫోన్​ చేసి స్థానికంగా ఉన్న ధాన్యాన్నే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సోకల్పల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉన్న విద్యుత్​ సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే చెప్పారు.

ఇదీ చూడండి: వెల్లువలా నకిలీ శానిటైజర్లు.. ఆల్కహాల్​కు బదులు రసాయనాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.