అసెంబ్లీ సమావేశాల్లో రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని.. సభలో అవకాశం ఇవ్వకపోతే...అసెంబ్లీ ప్రాంగణంలో అయినా.. ఆందోళన చేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. రైతుల కోసం అద్భుత పథకాలు అమలు చేస్తున్నామని చెప్పే రాష్ట్ర ప్రభుత్వం...రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశానికే తెలంగాణ రైతు అన్నం పెడుతున్నాడని సీఎం చెప్తున్నారని... ఆ అన్నదాత ఎందుకు ప్రాణం తీసుకుంటున్నారో చెప్పాలన్నారు. రూ. లక్ష కోట్లు వ్యయం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా... రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నిలదీశారు.
చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వం ద్వారా ఎలాంటి లాభం లేదని.. రైతులు, రైతు సంఘాలు.. ప్రతిపక్షాలతో సమావేశం ఏర్పాటు చేసి అన్నదాతలను ఆదుకోవాలని, వారిలో ఆత్మస్థైర్యం నింపాలని జగ్గారెడ్డి కోరారు. ప్రజల్లో ఆశలు కల్పించడంలో సీఎం కేసీఆర్ మంచి దిట్టని... ఆయన ముఖ్యమంత్రి అయితే రైతు పెరుగన్నం తిని అరుగులమీద పడుకుంటారన్న కేసీఆర్ మాట ఏమైందని విమర్శించారు.
ఇదీ చూడండి: ఆసిఫాబాద్‌లో రెండోరోజు డీజీపీ మహేందర్రెడ్డి పర్యటన