నారాయణ ఖేడ్ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిని శుభ్రంగా ఉంచకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్నట్లు రికార్డుల్లో ఉండి విధులకు హాజరుకాకుండా జీతాలు తీసుకుంటున్న సిబ్బందిపై వేటు వేశారు. వారి స్థానంలో కొత్త సిబ్బందిని నియమించాలని సూచించారు. పేద ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, రోగుల నుంచి అక్రమంగా సొమ్ము వసూలు చేయవద్దని సూచించారు. రోగుల గదులు, బాత్రూమ్లు పరిశుభ్రంగా ఉంచాలని... తనిఖీలు చేసే లోపు అందరూ పనితీరు మార్చుకోవాలని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ - government hospital visit
నారాయణఖేడ్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు.
నారాయణ ఖేడ్ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిని శుభ్రంగా ఉంచకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్నట్లు రికార్డుల్లో ఉండి విధులకు హాజరుకాకుండా జీతాలు తీసుకుంటున్న సిబ్బందిపై వేటు వేశారు. వారి స్థానంలో కొత్త సిబ్బందిని నియమించాలని సూచించారు. పేద ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, రోగుల నుంచి అక్రమంగా సొమ్ము వసూలు చేయవద్దని సూచించారు. రోగుల గదులు, బాత్రూమ్లు పరిశుభ్రంగా ఉంచాలని... తనిఖీలు చేసే లోపు అందరూ పనితీరు మార్చుకోవాలని సూచించారు.
Ravinder
9440880861
*నారాయణఖేడ్ ప్రభుత్వాస్పత్రి ఆకస్మిక తనిఖీ,సిబ్బంది పై ఎమ్మెల్యే ఆగ్రహం*
నారాయణ ఖేడ్ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి ఈరోజు ఉదయం నారాయణఖేడ్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని మరియు పరిసరాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిని శుభ్రంగా ఉంచకపోవడం, మరియు రోగులకు పెట్టిన ఐ వీ ఫ్లూయిడ్స్లు పెట్టడానికి మరియు తీయడానికి పైసలు వసూలు చేస్తున్న సిబ్బందిని తొలగిస్తున్నామన్నారు. సిబ్బంది సమయపాలన పాటించకపోవడం పై సూపర్ వైజర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్నట్లు రికార్డుల్లో ఉండి విధులకు హాజరుకాకుండా జీతాలు తీసుకుంటున్న 5 మంది సిబ్బందిని తొలగించి ఆ స్థానంలో పనిచేసే కొత్త సిబ్బందిని నియమిస్తామన్నారు. శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రభుతాసుపత్రికి వచ్చేది పేద ప్రజలే కావున వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, రోగుల వద్ద ఎలాంటి బలవంతపు పైసలు వసూలు చేయవద్దని, గదులు మరియు బాత్రూమ్ లు పరిశుభ్రంగా ఉంచాలని, ఆసుపత్రి పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచాలని, త్వరలోనే మళ్ళీ ఆకస్మిక తనిఖీ చేస్తానని ఆలోపు అందరూ తమ పనితీరు మార్చుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింగ్ చౌహాన్ కు తెలిపారు.Body:Tg_srd_36_22_mla_sudden_visit_ts10055Conclusion:Tg_srd_36_22_mla_sudden_visit_ts10055