లాక్డౌన్లో ఒక్క వ్యవసాయ పనులకు మాత్రమే మినహాయింపులు ఉన్నాయని, ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్లో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. కరోనా వల్ల ప్రజలు ఇబ్బంది పడటం వాస్తవమేనని ఆయన చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకానికి రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేపడుతోందన్నారు.
కరోనా వల్ల ప్రజలు పట్టణాల నుంచి పల్లెటూళ్లకు రావడం సంతోషదాయకమన్నారు. నాడు పంటలు పండక రైతులు తీవ్ర ఇబ్బందులు పడితే... నేడు పండించిన పంటలను నిల్వ ఉంచడానికి సరిపడా గోదాములు లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. రాబోయే కాలంలో ఎక్కువ శాతం యువత వ్యవసాయం వైపే మొగ్గుచూపుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం'