ETV Bharat / state

మా దగ్గర కరెంట్ లేదు, నీళ్లు రావు.. గోడు వెళ్లబోసుకున్న కర్ణాటక వాసులు - Harish Rao spoke to the people of Karnataka news

ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావుతో కర్ణాటక వాసులు గోడు వెళ్లబోసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమాలు ప్రవేశపెట్టి అభివృద్ధికి పాటుపడుతుంటే... తమకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు.

హరీశ్​రావుతో గోడువెళ్లబోసుకున్న కర్ణాటక వాసులు

author img

By

Published : Feb 12, 2021, 4:19 PM IST

ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం... గ్రామాల్లో నెలకొన్న సమస్యల గురించి ఆర్థిక మంత్రి హరీశ్ రావు కర్ణాటక వాసులను అడిగి తెలుసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఖరసగుత్తి గ్రామానికి వెళ్తూ... తెలంగాణ సరిహద్దులో ఉన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన జమిగి గ్రామస్థులు నీళ్ల బిందెలు పట్టుకోని రావడం చూసిన హరీశ్ రావు వాహనంలోంచి దిగి వారి వద్దకు వెళ్లి మాట కలిపారు.

హరీశ్​రావుతో గోడువెళ్లబోసుకున్న కర్ణాటక వాసులు

వృద్ధులు, దివ్యాంగులకు అందుతున్న పెన్షన్లు, రేషన్ కార్డుపై ఇస్తున్న సరుకులు, ఆడపిల్లల వివాహానికి ప్రభుత్వం నుంచే అందే సాయం వంటి వివరాలను అడిగి తెలుసున్నారు. గ్రామంలో తాగునీటి వసతి లేదని, దూరం నుంచి బిందెలతో మోసుకెళ్తున్నామని రుక్మిణీబాయి అనే మహిళ హరీశ్​రావుకు వివరించారు.

తమకు ఆరు గంటలే కరెంటు వస్తోందని.. అది కూడా మధ్యలో పదిసార్లు పోతోందని సంతోష్​ అనే రైతు పేర్కొన్నారు. తనకున్న ఐదు ఎకరాలకు నీటి తడి ఇవ్వడానికి పది రోజులు పడుతోందన్నారు. ఊర్లో కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటోందన్నారు. తెలంగాణలో సౌకర్యాలు బాగున్నాయని.. మా బాధలు పట్టించుకునే వాళ్లు లేరని కర్ణాటక వాసులు మంత్రితో ఆవేదన వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.