![](https://assets.eenadu.net/article_img/story-4a_131.jpg)
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి స్టేడియంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్లను మంత్రి హరీశ్‌రావు సోమవారం రాత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి నేతృత్వంలోని మినిస్టర్స్ ఎలెవన్, జిల్లా పాలనాధికారి హనుమంతరావు నేతృత్వంలోని అధికారుల జట్ల మధ్య క్రికెట్ పోటీ నిర్వహించారు. ఆసక్తికరంగా సాగిన ఈ పోటీలో కలెక్టర్ జట్టు విజయం సాధించింది. మంత్రి హరీశ్‌రావు బ్యాటింగ్ చేసినంత సేపూ క్రీడాభిమానులు కేరింతలు కొట్టారు.
ఇదీ చూడండి: క్రికెటర్ అవతారమెత్తిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి