సంగారెడ్డి జిల్లా గ్రేటర్ పటాన్‌చెరులోని భారతి నగర్ డివిజన్లో రూ. 1.2 కోట్లతో నిర్మించబోయే వర్షపునీటి కాలువకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. డివిజన్ అభివృద్ధి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ నీరు అందించాలని పలు కాలనీవాసులు కోరగా... సమస్య పరిష్కరించి నీరు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఎంఐజీ ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద తాగునీటి పైప్ లైన్ పనులు నిర్వహించాలని కోరారు.
ఇక్రిశాట్ ఫెన్సింగ్ వాసులకు పట్టాలు ఇచ్చేలా చూడాలని వారు మంత్రి కోరారు. దీంతో జిల్లా పాలనాధికారి హనుమంతురావుతో మాట్లాడి పట్టాలు ఇచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ సమీక్ష సమావేశంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి ఎమ్మెల్యేలు మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీతో పాటుగా పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఊర్లో ప్రియురాలు, దుబాయ్‌లో ప్రియుడు ఆత్మహత్య