ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు సంగారెడ్డి జిల్లా యంత్రాంగం "మేము సైతం" కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఉద్యోగ రీత్యా పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుల అనుభవాన్ని, మేధస్సును ప్రస్తుత తరానికి అందించడమే దీని లక్ష్యమని జిల్లా పాలనాధికారి హనుమంతరావు అన్నారు. విశ్రాంత ఉపాధ్యాయులు తమ సేవల్ని విద్యార్థులకు అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావడం హర్షణీయమని.. ఇప్పటి వరకు జిల్లాలో 30కి పైగా విశ్రాంత ఉపాధ్యాయులు ముందుకు వచ్చినట్లు వెల్లడించారు. విశ్రాంతి ఉద్యోగానికే కానీ.. వృత్తికి కాదని స్పష్టం చేశారు. మేము సైతం కార్యక్రమంలో భాగంగా వారు మొదట పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సరిస్తారని.. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ మంది చదువుకునేందుకు అవగాహన కల్పిస్తారని తెలిపారు.
ఇవీ చూడండి: ఈ బడిలో చదవాలంటే గొడుగు ఉండాల్సిందే