కరోనా రెండో దశ విస్తృతంగా వ్యాపిస్తున్నందున.. మనల్ని మనమే కాపాడుకోవాలని మెదక్ కలెక్టర్ హరీశ్ సూచించారు. అందుకు మాస్క్ ధరించడం ఒక్కటే మార్గమన్నారు. అపోహలు వీడి ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవాలని కోరారు. కలెక్టరేట్లో.. జిల్లా వైద్యశాఖ ఏర్పాటు చేసిన కొవిడ్ శిబిరంలో ఆయన పాల్గొన్నారు. 115 మందికి జరిపిన రాపిడ్ పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్ రాగా.. ఆస్పత్రిలో వైద్యం కోసం వారిని సిఫారసు చేశారు.
45 ఏళ్లు పైబడిన వారందరూ విధిగా టీకాలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. టీకాకు.. వైరస్ను అడ్డుకునే శక్తి ఉంటుందన్నారు. రెండు డోసుల అనంతరం.. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వివరించారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: సాహస క్రీడల్లో ప్రతిభ... ఇండియన్ నేవీకి ఎంపిక