సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం బచ్చుగూడెం, పోచారం గ్రామాల్లో వ్యవసాయ అధికారులు జలశక్తి అభియాన్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. వర్షపు నీరును ఏవిధంగా ఒడిసి పట్టాలో రైతన్నలకు వ్యవసాయాధికారిని ఉష వివరించారు. ప్రతి ఇంట్లోనూ.. పొలంలోనూ.. ఇంకుడు గుంతలు నిర్మించాలని సూచించారు. ఈ విధంగా చేయడం వల్ల భూగర్భ జలాలు పెరిగి.. నీటి సమస్యలను అధిగమించవచ్చునని ఆమె పేర్కొన్నారు.
ఇదీ చూడండి:భార్య కాపురానికి రావడంలేదని ట్యాంక్పై నుంచి దూకిన భర్త