న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కోర్టులో అవగాహణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పాపిరెడ్డి పాల్గొన్నారు. అందరికి న్యాయం అందించాలనే ఉద్దేశంతోనే 1995లో ఉచిత న్యాయ సేవా చట్టం రూపుదిద్దుకుందని తెలిపారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 9న ఈ దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు.
న్యాయసేవా చట్టం ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. నిరుపేదల కోసం ఈ చట్టం ఏర్పాటు చేశారని వారు ఉచితంగా న్యాయం పొందవచ్చు అని పేర్కొన్నారు. న్యాయవాదులు అందరూ ప్రజలకు ప్రతి విషయాన్ని చెప్పి నిజాయితీగా న్యాయం అందించాలన్నారు.
ఇదీ చూడండి: చదువుకుంటూనే సేవా కార్యక్రమాలు.. రచయితగానూ గుర్తింపు