సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఆశా కో పరిశ్రమలోని కార్మికులను లాక్డౌన్ పేరుతో తొలగించారని సీఐటీయూ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అలాగే సరైన కాలంలో వేతనాలు చెల్లించడంలేదని పరిశ్రమ ఎదుట నిరసన తెలిపారు.
బకాయి వేతనాలను చెల్లించాలని, అందరూ కార్మికులను మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు న్యాయం జరగకపోతే ఊరుకునేది లేదని, వెంటనే వారి డిమాండ్లు నెరవేర్చాలని సీఐటీయూ నాయకులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్