ETV Bharat / state

'జేపీఎస్​ల ప్రొబేషన్​ కాలాన్ని 2 సంవత్సరాలకు తగ్గించాలి' - సంగారెడ్డి జిల్లా తాజా వార్తలు

ప్రొబేషన్ కాలాన్ని 3 నుంచి 2 సంవత్సరాలకు తగ్గించాలని... సంగారెడ్డి జిల్లా జూనియర్​ పంచాయతీ కార్యదర్శులు డిమాండ్​ చేశారు. పని వేళల్లో మహిళా కార్యదర్శులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కొండాపూర్ మండలం మల్కాపూర్​లో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించి సమస్యలపై చర్చించారు.

junior panchayat secretaries district level meeting in sangareddy district
జేపీఎస్​ల ప్రోబిషన్​ కాలాన్ని 2 సంవత్సరాలకు తగ్గించాలి'
author img

By

Published : Jan 24, 2021, 5:22 PM IST

గ్రామాల్లో పని భారం ఎక్కువవుతోందని, తమకు ఒక సహాయకున్ని నియమించాలని... సంగారెడ్డి జిల్లా జూనియర్​ పంచాయతీ కార్యదర్శులు అన్నారు. కొండాపూర్ మండలం మల్కాపూర్​లో జేపీఎస్​ల జిల్లా స్థాయి సమావేశం నిర్వహించి సమస్యలపై చర్చించారు. ప్రొబేషన్ కాలాన్ని 2 సంవత్సరాలకు తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వమే ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.

కార్యదర్శులపై తోసివేయడం అన్యాయం...

ప్రస్తుతం మహిళా కార్యదర్శులకు ఉన్న నాలుగు నెలల ప్రసూతి సెలవులను 6 నెలలకు పొడిగించాలన్నారు. పని వేళల్లో వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఏ పని జరగకపోయినా పంచాయతీ కార్యదర్శులపై తోసివేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. తమ తప్పుంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా అంగీకరిస్తామని చెప్పారు. సీనియర్ అసిస్టెంట్​లకు ఇచ్చే వేతనం తమకు చెల్లించాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి: సేంద్రియ సాగు: పెట్టుబడి కొంచెం.. లాభాలు ఘనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.