ETV Bharat / state

Jaggareddy comments on pm modi: 'భాజపాది రైతుల పొట్టకొట్టే ప్రయత్నం' - తెలంగాణ వార్తలు

భాజపా రైతుల పొట్టకొట్టే విధానాలు అనుసరిస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jaggareddy comments on pm modi) ఆరోపించారు. అధికారంలో ఉన్న నాయకులే కాన్వాయిలతో రైతులపై దూసుకెళ్లడం న్యాయమా? అని ప్రశ్నించారు. ప్రియాంక గాంధీ అరెస్టుకు నిరసనగా సంగారెడ్డి జిల్లాకేంద్రంలో ధర్నా చేపట్టారు.

Jaggareddy comments on pm modi, mla jaggareddy strike in sangareddy
మోదీపై జగ్గారెడ్డి ఆరోపణలు, సంగారెడ్డిలో జగ్గారెడ్డి ధర్నా
author img

By

Published : Oct 4, 2021, 5:35 PM IST

కేంద్రప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా పాలించడం ఏంటని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jaggareddy comments on pm modi) ప్రశ్నించారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడిన రైతులను చంపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్​లో ప్రియాంక గాంధీ అరెస్టుకు నిరసనగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు. రోడ్డుపై కాంగ్రెస్ నాయకులు బైఠాయించడంతో కాసేపు ట్రాఫిక్ స్తంభించింది. డీఎస్పీ బాలాజీ తమ సిబ్బందితో జగ్గారెడ్డిని, నాయకులను అరెస్టు చేసి పట్టణ పోలీసు స్టేషన్​కి తరలించారు.

ప్రధాని మోదీపై జగ్గారెడ్డి ఆరోపణలు

అమాయక రైతులు బలి

మోదీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల వల్ల అమాయక రైతులు మరణిస్తున్నారని ఆరోపించారు. భాజపా ప్రభుత్వం రైతుల పొట్టకొట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. అధికారంలో ఉన్న నాయకులే కాన్వాయిలతో రైతులపై దూసుకెళ్లడం న్యాయమా? అని ప్రశ్నించారు. ప్రియాంక గాంధీ రైతులను పరామర్శించడానికి వెళ్తే అరెస్టు చేసినందుకు కాంగ్రెస్ తరఫున సోమవారం ధర్నా చేపట్టామన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కొట్లాడుతుందని స్పష్టం చేశారు. అన్నదాతలకు అండగా ఉంటామని... ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.

ఇదీ జరిగింది..

యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో లఖింపుర్​ ఖేరీలో(Lakhimpur Kheri violence) హింస చెలరేగింది. టికునియా-బన్​బీర్​పుర్​ సరిహద్దు వద్ద సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులు, అధికార వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణించారు. నిరసన చేస్తున్న అన్నదాతలపైకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్ర కుమారుడు ఆశిష్‌ మిశ్ర కారుతో పాటు మరో వాహనం దూసుకెళ్లడం వల్లే రైతులు మరణించినట్లు తెలుస్తోంది.

ప్రియాంక దీక్ష

ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్​ హింసాత్మక ఘటనపై(lakhimpur kheri incident) నిరసనగా నిరాహార దీక్షకు దిగారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(priyanka gandhi news today). లఖింపుర్​కు వెళ్తున్న నేపథ్యంలో ఆమెను పోలీసులు సితాపుర్​ వద్ద అరెస్టు చేయగా.. అక్కడే ఆమె నిరాహార దీక్ష చేపట్టినట్టు పార్టీ ప్రకటించింది. హింసాత్మక ఘటనలో మృతిచెందిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు గాంధీ(up news priyanka gandhi) వెళ్లారు. ఆమె వెంట కాంగ్రెస్​ నేతలు కూడా ఉన్నారు. అయితే రైతుల కుటుంబాలను చూడనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. సీతాపుర్​లోని ఓ అతిథి గృహానికి తరలించి గృహ నిర్బంధంలో ఉంచారు.

ప్రియాంక గాంధీ బృందాన్ని అరెస్టు చేయడంపై కాంగ్రెస్​ మండిపడింది. రాజకీయ నేతలు ఎక్కడికైనా ప్రయాణించవచ్చని.. వారి స్వేచ్ఛను హరింపజేయడం అత్యంత ప్రమాదకరమని సీనియర్​ నేత రాజివ్​ శుక్లా మండిపడ్డారు. ఈ ఘటనకు నిరసనగా.. మంగళవారం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల ముందు ఆందోళనలు చేపడతామని ప్రకటించారు.

ఇదీ చదవండి: lakhimpur violence news: గృహ నిర్బంధంలో ప్రియాంక నిరాహార దీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.