సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పస్తాపూర్లోని దక్కన్ డెవలప్మెంట్ సొసైటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జాతీయ వ్యవసాయ అనుసంధాన సంస్థ డిప్యూటీ డైరెక్టర్ వినీత కుమారి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మూడు దశాబ్దాలుగా సేంద్రియ విధానంలో చిరుధాన్యాల సాగులో మహిళలు ముందుకు సాగడం అభినందనీయమన్నారు.
చిరుధాన్యాల సాగు, సంఘం రేడియో, వీడియోగ్రఫీ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న డీడీఎస్ మహిళలకు ఈ సందర్భంగా జ్ఞాపికలు బహుకరించారు. మహిళలు అన్ని రంగాల్లో సాధికారత సాధించినప్పుడే నిజమైన మహిళా దినోత్సవం జరుపుకున్నట్టని డీడీఎస్ డైరెక్టర్ పీవీ సతీష్ అభివర్ణించారు.
ఇదీ చూడండి: ఒక గంట ఎంపీడీవోగా బాధ్యతలు.. ఓ విద్యార్థినికి అవకాశం