సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గీతం విశ్వవిద్యాలయం కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజినీరింగ్ నాలుగో అంతర్జాతీయ సదస్సును డీఆర్డీవో శాస్త్రవేత్త డాక్టర్ కిషోర్ నాథ్ ప్రారంభించారు. రక్షణ రంగంలో కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ లపై జరుగుతున్న పరిశోధనల గురించి ఆయన వివరించారు. ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకున్నప్పుడే రాణించగలరని అభిప్రాయపడ్డారు. రెండు రోజులు పాటు జరిగే సదస్సును సద్వినియోగం చేసుకోవాలన్నారు.
నిపుణులు ఉపన్యాసాల ద్వారా జ్ఞానాన్ని పొందాలని డాక్టర్ నాథ్ సందర్శకులకు సూచించారు. రాబోయే ఐదేళ్లలో ఇప్పుడున్న 50 శాతం ఉద్యోగాలు ఉండబోవని, కృత్రిమ మేధ అంతలా ప్రభావం చూపుతుందని మెకెన్సీ నివేదిక ఉటంకిస్తుందని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్. శివప్రసాద్ తెలిపారు.
ఇదీ చూడండి : 'ఆడపిల్లలకు సాధికారత ఇంట్లో నుండే ప్రారంభం కావాలి'