ETV Bharat / state

పటాన్​చెరు పారిశ్రామికవాడలో ఆక్రమణల కూల్చివేత! - పటాన్​చెరు పారిశ్రామిక వాడలో ఆక్రమణలను కూల్చివేసిన టీఎస్​ఐఐసీ

పటాన్​చెరు పారిశ్రామిక వాడలో ఆక్రమించి కట్టిన నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. ఫేజ్​-1లోని కొన్ని ఆక్రమణలను తొలగించి మరికొంత మందికి నోటీసులు జారీచేశారు.

illegal occupancies were demolished by tsiic in patancheru
పటాన్​చెరు పారిశ్రామికవాడలో ఆక్రమణల కూల్చివేత
author img

By

Published : Dec 18, 2020, 11:21 AM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పారిశ్రామికవాడలోని ఆక్రమణలను టీఎస్ఐఐసీ అధికారులు తొలగించారు. నియోజవర్గ కేంద్రంలో ఉన్న పారిశ్రామికవాడలో స్థలాలు ఆక్రమించి దుకాణాలు, షెడ్లు వేసి కొంతమంది ఆక్రమించుకున్నారు. చాలా కాలంగా వీటిని తొలగించాలని అధికారులు యత్నిస్తున్నా కొందరు రాజకీయ నాయకుల ఒత్తిడితో చేయలేకపోతున్నారు.

చివరకు గురువారం పటాన్​చెరు పారిశ్రామికవాడ ఫేజ్-1లో కొన్ని ఆక్రమణలను జేసీబీ సహాయంతో అధికారులు తొలగించారు. మరికొంతమందికి గడువుతో నోటీసులు జారీ చేశారు. వాడలో ఇకపై ఆక్రమణలను ఉపేక్షించబోమని తెలిపారు.

ఇదీ చదవండి: కళ్లెదుటే కొనఊపిరితో కుమారుడు.. ఫలించని తల్లి ప్రయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.