ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దుకాణాన్ని కూల్చేయడంపై బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని 36వ వార్డులో పురపాలిక అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించారు. కొన్నేళ్లుగా తాము ఆధారపడి జీవిస్తున్నా షాపును తొలగించడంతో బతుకుదెరువు కోల్పోయానని వాపోయారు.
షాపులోని సామగ్రి తీసేందుకు కూడా సమయం ఇవ్వలేదన్నారు. మున్సిపల్ కార్యాలయానికి వెళ్తే అధికారులెవ్వరూ లేరని బాధితుడు తెలిపారు. కావాలనే తన షాపును కూల్చేశారని న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. తాము అధికారుల అనుమతితోనే దుకాణం ఏర్పాటు చేసుకున్నామని బాధితుడు వెల్లడించారు.