ఎంటెక్ కోర్సుల ప్రాధాన్యం పెంచేందుకు ఐఐటీల్లో కొత్త విధానాన్ని రూపొందించినట్లు హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ బిఎస్ మూర్తి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ప్రతిపాదనలను.. దిల్లిలోని ఐఐటీ కౌన్సిల్ ఆమోదించినట్లు తెలిపారు. కమిటీలో మూర్తితో పాటు ఐఐటీ జమ్ము డైరెక్టర్ మనోజ్ ఎస్.గౌర్, ఐఐటీ దిల్లీ ప్రొపెసర్ బాలకృష్ణన్ ఉన్నారు. ఎంటెక్ కోర్సుల్లో ప్రమాణాలు పెంచేలా సిఫార్సు చేసినట్లు మూర్తి తెలిపారు. బీటెక్‌తో సమానంగా ఎంటెక్ ఫీజుల పెంపు, గేట్ ప్రవేశ పరీక్షలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు నేరుగా పీహెచ్‌డీలో ఫెలోషిప్ ఇవ్వడం, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఎంటెక్ కోర్సులను రూపొందించామని అన్నారు.
ఇవీచూడండి: ఆర్బీఐ నుంచి కేంద్రానికి రూ.30వేల కోట్ల మధ్యంతర డివిడెండ్!