ETV Bharat / state

కరోనా పరిశోధనల్లో ఐఐటీ హైదరాబాద్​ మరో ముందడుగు - ఇంజినీరింగ్​ ప్రొఫెసర్​ శివగోవింద్​ సింగ్​

కరోనా పరిశోధనల్లో ఐఐటీ హైదరాబాద్ కీలక అడుగు వేసింది. అతి తక్కువ ధరలో కరోనా నిర్ధరణ కిట్​ను తయారు చేసింది. కృత్రిమ మేథను ఉపయోగించి.. 20 నిమిషాల్లోనే ఫలితం రాబట్టేలా టెస్ట్ కిట్​కు రూపకల్పన చేసింది ఇంజినీరింగ్​ ప్రొఫెసర్​ శివగోవింద్​ సింగ్​ సారథ్యంలోని పరిశోధక బృందం.

Hyderabad IIT manufactures the Corona Verification Kit at a very low cost
కరోనా పరిశోధనల్లో ఐఐటీ హైదరాబాద్​ మరో ముందడుగు
author img

By

Published : Jun 7, 2020, 8:20 PM IST

కరోనా పరిశోధనల్లో ఐఐటీ హైదరాబాద్ కీలక అడుగు వేసింది. అతి తక్కువ ధరలో, స్వల్పకాలంలో స్పష్టమైన ఫలితం వచ్చేలా.. కరోనా నిర్ధరణ కిట్​ను రూపొందించింది. ఇప్పటికే అతి తక్కువ ధరలో వెంటిలేటర్లను అభివృద్ధి చేసిన ఈ సంస్థ.. అదే బాటలో కొవిడ్-19 టెస్ట్ కిట్​ను రూపొందించింది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్​కు చెందిన ప్రొఫెసర్ శివగోవింద్ సింగ్ సారథ్యంలోని పరిశోధక బృందం సభ్యులు డాక్టర్ సూర్యస్నాత త్రిపాఠి, సుప్రజ అనే పరిశోధక విద్యార్థులు దీనిలో కీలక పాత్ర పోషించారు.

కేవలం 20 నిమిషాల్లోనే స్పష్టమైన ఫలితాన్ని రాబట్టేలా.. కృత్రిమ మేథను సైతం వినియోగిస్తున్నారు. ఈఎస్​ఐసీ వైద్య కళాశాల, హైదరాబాద్​లోని ఆస్పత్రిలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్​లో ఈ టెస్ట్​ కిట్​ విజయవంతమైంది. ఈ కిట్లను పెద్ద ఎత్తున తయారికీ అనుమతించాలంటూ ఐసీఎంఆర్​కు దరఖాస్తు చేశారు. ఒక్కో టెస్ట్ కిట్ తయారీకి రూ.600 ఖర్చవుతోందని.. భారీ సంఖ్యలో ఉత్పత్తి చేస్తే వ్యయం 350 రూపాయల లోపు తగ్గుతుందని ప్రొఫెసర్ శివగోవింద్​సింగ్ తెలిపారు.

కరోనా పరిశోధనల్లో ఐఐటీ హైదరాబాద్​ మరో ముందడుగు

ఇదీచూడండి: ఐఐటీ కిట్​తో అతి చౌకగా కరోనా పరీక్ష!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.