Husband saves Wife From Online Harassment : తనతో ఏడు ఆడుగులు వేసి జీవితాన్ని పంచుకుంటానని నమ్మించి మోసం చేస్తున్నవారెందరో నేడు. చిన్నపాటి విషయాలకు అనుమానాలు, గొడవలు, చంపడాలు లేదా చావడాలు.. ఇలాంటి ఘటనలు రోజుకు ఎన్నో జరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం చాలా మంది భర్తలకు నచ్చదు. ఎందుకంటే అక్కడ పొంచి ఉన్న ప్రమాదం గురించి వారికి తెలుసు కాబట్టి. కానీ కొందరు ప్రమాదం సంగతి పక్కన ఉంచి.. అనుమానంతో భార్యలను వేధిస్తూ ఉంటారు. కానీ సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం అలా కాదు.
Husband Saves Wife From Social Media Harassment : తన భార్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నా.. అది తన సొంత విషయం అని కామ్‌గా ఉన్నాడు. ఆమెకు అడ్డుచెప్పకపోగా.. తనను నెట్టింట ఓ వ్యక్తి వేధిస్తున్నాడని.. అశ్లీల చిత్రాలు పంపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని చెప్పగానే.. ఇదంతా నువ్వు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం వల్లేనని సగటు భర్తలా ప్రవర్తించకుండా ఆమెపై నమ్మకం ఉంచాడు. అదే నమ్మకంతో ఆమె వెంటే ఉండి ఆ సమస్యను పరిష్కరించాడు. తన భార్యను వేధిస్తున్న ఆ బ్లాక్‌మెయిలర్‌ను పట్టుకుని ఆ తర్వాత ఏం చేశాడంటే..?
Husband saves Wife From Online Harassment in Sangareddy : సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి భార్యకు ఓ తెలియని వ్యక్తి అశ్లీల చిత్రాలను వాట్సాప్ చేశాడు. ఆమె ఆ విషయాన్ని తన భర్తకు తెలియజేసింది. ఆమెకు ధైర్యం చెప్పిన భర్త టెక్నాలజీని ఉపయోగించి నిందితుడిని గుర్తించాడు. తన తెలివితో చాకచక్యంగా వ్యవహరించి పోలీసుల దగ్గరకు రప్పించాడు. నిందుతున్ని గుర్తించడానికి అతను కొన్ని యాప్‌లను వాడాడు. నిందితుడి ఫోన్ నంబరును ఎవరు ఎన్నిరకాలుగా తమ చరవాణిలో నమోదు చేసుకున్నారో తెలుసుకున్నాడు.
మెదక్ పక్కనే ఉన్న పల్లెటూరుకు చెందిన వ్యక్తి తన భార్యకు అశ్లీల చిత్రాలు పంపినట్లు గుర్తించాడు ఆ వ్యక్తి. ఆమె భర్త తన స్నేహితులతో కలిసి రెండు రోజుల క్రితం అతడి ఊరికి వెళ్లాడు. టెక్నాలజీ ఆధారంగా సేకరించిన అతడి ఫొటోలను గ్రామస్థులకు చూపించారు. ఆ గ్రామస్థులు అతడి గురించి.. ఎక్కువగా అప్పులు చేస్తుంటాడని.. వాటిని ఎగ్గొడుతుంటాడని.. వారికి చెప్పారు. అతడు నివసించే అడ్రెస్‌తో పాటు అతడి బంధువు మొబైల్ నంబర్ కూడా ఇచ్చారు.
బాధితులు తన కోసం గాలిస్తున్నారని తెలిస్తే పారిపోతాడని ముందే గ్రహించి.. అతడి బంధువుకు కాల్ చేసి.. తమ బంధువులకు అప్పు తిరిగి చెల్లించడం లేదని చెబుతూ వచ్చారు. వాళ్లు మాత్రం 'మావాడు చాలా మంచోడు... మేమే వస్తున్నాం' అంటూ పోలీస్‌స్టేషన్‌కు అతన్ని తీసుకుని వచ్చారు. సోమవారం రోజున స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అప్పటికే పక్కా ఆధారలతో సిద్ధంగా ఉన్న బాధితురాలి భర్త పోలీసులకు అంతా వివరించాడు. అక్కడ ఉన్న వారందరికీ ఆధారాలను చూపించి ఫిర్యాదు చేశాడు. చేసేదేం లేక నిందుతుడు నేరాన్ని అంగీకరించాడు. ఇచ్చిన ఆధారాలను పరిశీలించి కేసు నమోదు చేస్తామని సీఐ నవీన్ కుమార్ తెలిపారు.
ఇవీ చదవండి: