కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో జీఎస్టీ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని హైదరాబాద్ రేంజ్ చీఫ్ కమిషనర్ మల్లికా ఆర్య తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన జీఎస్టీ అవగాహన సదస్సులకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇప్పటి వరకు 25 జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించామన్నారు.
వ్యాపారులు, పన్ను చెల్లింపుదారుల సందేహాలను జీఎస్టీ అధికారులు నివృత్తి చేశారు. సమస్యలు, సూచనలు కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తామని హమీ ఇచ్చారు.