సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గొల్లపల్లిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ మనోజ్ రెడ్డి ప్రారంభించారు. రైతులు తాము పండించిన పంట దళారుల చేతికి చిక్కకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు.
కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా కొనుగోలు కేంద్రాల్లో భౌతిక దూరం పాటించాలని కోరారు. ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు.