సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని తిరుమల లాడ్జిలో ఫ్యానుకు ఉరివేసుకొని ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం క్యాదిగిరాకు చెందిన మహమ్మద్ మోసిన్... అదే మండలంలోని అల్లాపూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.
బుధవారం సాయంత్రం లాడ్జ్‌లో గది అద్దెకు తీసుకొని రాత్రి అక్కడే గడిపాడు. గురువారం ఉదయం తన సోదరుడు మిస్కిన్కు ఫోన్ చేసి నేను చనిపోతున్నాను అని చెప్పి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వెంటనే మిస్కిన్ పోలీసులకు సమాచారమిచ్చాడు. వెళ్లి చూడగా... అప్పటికే మృతి చెందాడు. మృతదేహం వద్ద ఉపాధ్యాయ శిక్షణ కరదీపిక, ఆధార్ కార్డు దొరికాయి. మోసిన్ కొంతకాలంగా మానసిక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఇదీ చూడండి: ప్రేమన్నాడు... పెళ్లి చేసుకున్నాడు... వదిలేశాడు