సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో (gas cylinder blast at patancheru) గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. ఒకరికి స్వల్పంగా గాయాలయ్యాయి. భవనం పాక్షికంగా దెబ్బతింది.
పటాన్చెరు గోకుల్‌నగర్‌లో నాగభూషణం ఇంటి వంట గదిలో గ్యాస్ (GAS LEAKAGE AT SANGAREDDY DISTRICT)లీకైంది. అతని కుమారుడు సాయికిరణ్.. తలుపులు తెరిచి లైటు వేశాడు. గ్యాస్ వాసన వస్తుండడంతో పై అంతస్తులో ఉన్న ప్రవీణ్‌కుమార్ విద్యుత్ మెయిన్ ఆఫ్ చేద్దామని కింద అంతస్తుకు వచ్చాడు. ఇంతలోనే పెద్దశబ్ధంతో గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి ఇంట్లో రెండు గోడలు కూలిపోయాయి. ఈ ఘటనలో ప్రవీణ్, సాయిచరణ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడే ఉన్న మరో మహిళ స్వల్పంగా గాయపడ్డారు. అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం తీవ్రంగా గాయపడిన ప్రవీణ్‌కుమార్‌ను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలిని పరిశీలించారు. స్థానిక కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ ఘటనా స్థలిని పరిశీలించి.. క్షతగాత్రులను పరామర్శించారు. భవనం పాక్షికంగా దెబ్బతినడంతో నివాసయోగ్యమో కాదో ఇంజినీరింగ్ అధికారులతో ధ్రువీకరణ చేయిస్తామని తెలిపారు. ఈ ఘటనలో చుట్టుపక్కల ఉన్న ఇళ్ల అద్దాలు కూడా పూర్తిగా ధ్వంసం అయ్యాయి.
ఇదీచూడండి: LIVE VIDEO: సొంత బ్యాండ్ స్టార్ట్ చేశాడని చితక్కొట్టారు