Former MLA Jagga Reddy Press Note Release : "ఒక బలవంతుడు భూమి మీద ఎప్పటికీ బలవంతుడిగా ఉండలేడు. కొన్ని సంవత్సరాలు మాత్రమే బలవంతుడిగా ఉంటాడు. అతడు ఏదో ఒక రోజు బలహీనుడు కాక తప్పదు. అది ఏ వ్యవస్థలోనైనా, వ్యాపారం, రాజకీయం ఏ రంగంలోనైనా అంతే. అలాగే బలహీనులు ఎప్పటికీ బలహీనులుగా ఉండరు." అంటూ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jagga Reddy) ఒక పత్రిక ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి, ప్రజలకు ఈ ప్రకటన ద్వారా ఆయన ఒక సందేశాన్ని పంపించారు.
'బలవంతుడి సమయం గడిచే వరకు బలహీనుడు మౌనంగానే ఉంటాడు. ఆ మౌనం బలహీనుడి బలహీనత కాదు. బలహీనుడు తన టైం కోసంఎదురుచూస్తూ ఉంటాడు. కాలం చేసే నిర్ణయంలో బలహీనుడు ఒకరోజు బలవంతుడు అవుతాడు. మనిషి జీవితం యవ్వనం నుంచి ముసలితనం వరకు ఎలాగైతే సాగుతుందో అలాగే ఈ బలవంతుడు బలహీనుడి కథ కూడా అంతే. ఒక నాయకుడి గెలుపు, ప్రజలను పరిపాలించే సమయం. ఒక నాయకుడి ఓటమి, గత పరిపాలనలో ఉన్న లోపాలు. ఆ లోపాలను సమీక్షించుకొని భవిష్యత్తులో విజయాలు సాధించడానికి ముందడగు వేసే సమయం అంటూ' సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.
MLA Jagga Reddy Latest News : తాను 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అందులో 3 సార్లు సంగారెడ్డి ప్రజలు తనను గెలిపించుకున్నారని జగ్గారెడ్డిగా తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా మంచి పరిపాలన చేశానని చెప్పారు. మొదటిసారి 2014లో ఓడిపోయినా, ఆ ఓటమి తనకు చాలా అనుభవాలు నేర్పిందని వెల్లడించారు. అలాగే ఇప్పుడు 2023 శాసనసభ ఎన్నికల్లో(Telangana Elections 2023) రెండోసారి ఓడిపోయానన్న జగ్గారెడ్డి, ఈ పది రోజుల్లోనే చాలా అనుభవాలు నేర్చుకున్నానంటూ పేర్కొన్నారు.
ఎన్నికల్లో ఓడినవారికి పదవుల్లేవ్ - ఏడాది పాటు వేచి చూడాల్సిందే
ఎమ్మెల్యేగా లేకపోయినా : ఈసారి తమ సంగారెడ్డి ప్రజలు తనకు 5 ఏళ్లు రెస్ట్ ఇచ్చారంటూ జగ్గారెడ్డి చెప్పారు. అందుకే ఈ సమయాన్ని తాను పూర్తిగా పార్టీ కోసం పని చేసేందుకు ఉపయోగించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా 6 గ్యారెంటీలను(Congress Six guarantees) తెలంగాణలో అమలు చేస్తున్నారు. అలాగే తాను ఎమ్మెల్యేగా లేకపోయినా సంగారెడ్డి ప్రజలకు కూడా ఆ పథకాలను అందేలా కృషి చేస్తానని జగ్గారెడ్డి తెలిపారు.
"ప్రస్తుతం తాను తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పూర్తి సమయం ఆ పదవికే కేటాయిస్తాను. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ(Rahul Gandhi) నాయకత్వంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అనుమతితో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీకి పూర్తి సమయాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను. అందుకే నా ఆలోచనను కాంగ్రెస్ నాయకత్వానికి, ప్రభుత్వంలోని ఉన్న నాయకత్వానికి, నాయకులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ అభిమానుకు, రాష్ట్ర ప్రజలకు తెలియ జేస్తున్నాను" - జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన కాంగ్రెస్ను మరవద్దు : జగ్గారెడ్డి
రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మా ప్రభుత్వానిది : సీఎం రేవంత్ రెడ్డి