సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు ఎండిపోయి మత్సకారులకు పెద్ద ఎత్తున నష్టం కలిగించింది. ఎప్పుడూ తరగని చెరువు ఎండిపోవడం వల్ల భారీ సంఖ్యలో చేపల చనిపోయి పైకి తేలాయి. దాదాపు వంద కుటుంబాలకు చెందిన మత్స్యకారులు ఈ చెరువుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.
తమకు లక్షలాది రూపాయల నష్టం జరిగిందని స్థానిక మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల తమ జీవనోపాధి దెబ్బతిందని ఆందోళన వ్యక్తం చేశారు. గత 50 ఏళ్లుగా ఈ చెరువు ఎన్నడూ వాడిపోలేదని వారు వివరించారు.
ఇవీ చూడండి : 'పీవోఎస్ యంత్రాలపైనే ఎరువుల విక్రయాలు'