ETV Bharat / state

'రైతుకు సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్లే...' - 'రైతుకు సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్లే...'

సంగారెడ్డి జిల్లా కల్హేర్​ మండలంలోని బీబీపేట్​లో నియంత్రిత వ్యససాయ సాగు విధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్​ హనుమంతరావు హాజరయ్యారు. ప్రభుత్వం సూచించిన పంటలు వేసి... లాభాలు ఆర్జించాలని తెలిపారు.

farmer awareness program in bebepet
'రైతుకు సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్లే...'
author img

By

Published : May 26, 2020, 2:56 PM IST

రైతుకు సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్లేనని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. కల్హేర్ మండలంలోని బీబీపేట్​లో ఏర్పాటుచేసిన నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్​ కొత్త విధానానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.

సన్నరకం వరి సాగుకు ప్రథమ ప్రాధాన్యమివ్వాలని సూచించారు. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చేస్తున్న నూతన పంట సాగు విధానం అమలు చేయాల్సిన గురుతర బాధ్యత అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతు సమన్వయ సమితి ప్రతినిధులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 66 కరోనా పాజిటివ్‌ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.