సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎక్సైజ్ పోలీసులు పలు గ్రామాల్లో దాడులు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన కల్తీ కల్లు, తయారీ సామగ్రి ధ్వంసం చేశారు. పోలీసులకు వచ్చిన పక్కా సమాచారంతో నారాయణఖేడ్ మండలంలోని గంగాపూర్‌లో సాయిలు వద్ద 2 లీటర్ల సారాయి, జమ్ల తాండలో రాఠోడ్ శెట్టి వద్ద ఒక లీటర్ సారాయి, 30 కేజీల ఇప్పపువ్వు, 20 లీటర్ల వాష్ దొరికాయి. తౌల్య తండాలో తిర్ర రాఠోడ్ దగ్గర 90 లీటర్ల కల్లు లభ్యమైంది. వీరిద్దరూ పరారీలో ఉండగా... పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తహసీల్దార్ సమక్షంలో రెండు లక్షల రూపాయలకు బైండోవర్ చేశారు. ఆయా తండాల్లో నిందితులకు జరిమానా విధించాలని తీర్మానం చేశారు.
ఎక్సైజ్ పోలీసుల దాడులు.. భారీగా సరుకు లభ్యం - CORONA EFFECTS
లాక్డౌన్ వేళ మద్యం దుకాణాలు మూసివేయటం వల్ల నిషేధిత సారా, కల్తీ కల్లు తయారీకి తెరలేపారు అక్రమార్కులు. పోలీసులకు దొరికిన పక్కా సమాచారంతో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లోని పలు గ్రామాల్లో అబ్కారీ పోలీసులు దాడులు నిర్వహించి పెద్దఎత్తున సరుకును ధ్వంసం చేశారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎక్సైజ్ పోలీసులు పలు గ్రామాల్లో దాడులు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన కల్తీ కల్లు, తయారీ సామగ్రి ధ్వంసం చేశారు. పోలీసులకు వచ్చిన పక్కా సమాచారంతో నారాయణఖేడ్ మండలంలోని గంగాపూర్‌లో సాయిలు వద్ద 2 లీటర్ల సారాయి, జమ్ల తాండలో రాఠోడ్ శెట్టి వద్ద ఒక లీటర్ సారాయి, 30 కేజీల ఇప్పపువ్వు, 20 లీటర్ల వాష్ దొరికాయి. తౌల్య తండాలో తిర్ర రాఠోడ్ దగ్గర 90 లీటర్ల కల్లు లభ్యమైంది. వీరిద్దరూ పరారీలో ఉండగా... పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తహసీల్దార్ సమక్షంలో రెండు లక్షల రూపాయలకు బైండోవర్ చేశారు. ఆయా తండాల్లో నిందితులకు జరిమానా విధించాలని తీర్మానం చేశారు.
ఇదీ చూడండి:- కరోనా చికిత్సకు ఆ మందు వాడితే ప్రాణాలు హరీ!