సంగారెడ్డిలోని పురోహితులకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. శుభకార్యాలన్నీ కరోనా ప్రభావంతో వాయిదా పడడం వల్ల ఉపాధి లేక పురోహితులకు ఇబ్బందులు తలెత్తాయి. వారికి అండగా నిలిచేందుకు నిత్యావసరాలను పంచిపెట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం కలెక్టరేట్ ఆవరణలో అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. జిల్లాకు సంబంధించి కరోనా కట్టడిపై మంత్రి చర్చించారు. లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు హరీశ్‌రావు సూచించారు.
ఇవీ చూడండి: 24 గంటల్లో 1,383 కొత్త కేసులు- 50మరణాలు