పోలీసు అమర వీరుల దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి పోలీస్ సిబ్బందికి ఉన్నతాధికారులు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. వివిధ హోదాలో ఉన్న పోలీసులకు వేర్వేరు అంశాల మీద వ్యాసరచన పోటీలు పెట్టారు.
కానిస్టేబుల్ స్థాయి నుంచి.. ఏఎస్సై స్థాయి వరకు.. కరోనా విపత్తులో పోలీసు విధి నిర్వహణలో ఎదురైన సవాళ్లు అనే అంశంపై.. ఎస్సై నుంచి ఆ పై స్థాయి వారికి కరోనాలో పోలీస్ విధి నిర్వహణలో నూతన పద్ధతులు అనే అంశంపై పోటీ నిర్వహించారు. ఈ పోటీల్లో 100 మంది వివిధ హోదాల్లో ఉన్న పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి : దీక్షిత్ కథ విషాదాంతం... కన్నీటి సంద్రంలో కుటుంబం