ETV Bharat / state

కరోనా వేళ... ఆన్‌లైన్‌కే మొగ్గు! - విద్యుత్తు బిల్లులు

విద్యుత్ వినియోగదారులు నగదు రహిత విధానంలో బిల్లుల చెల్లింపునకు ఆసక్తి చూపుతున్నారు. ఆన్‌లైన్‌లో చెల్లిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఏప్రిల్‌ మాసానికి సంబంధించి బిల్లుల చెల్లింపు తీరు దీనినే సూచిస్తోంది.

sangareddy district latest news
sangareddy district latest news
author img

By

Published : May 9, 2020, 3:24 PM IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో విద్యుత్ బిల్లుల చెల్లింపు ఆన్‌లైన్‌లో చేయాలని సంగారెడ్డి జిల్లా అధికారులు వాహనాల ద్వారా ప్రచారం చేశారు. కొన్ని ప్రాంతాల్లో వసూలు కౌంటర్లను ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కువ మంది ఆన్‌లైన్‌లో చెల్లించేందుకే మొగ్గుచూపారు. కౌంటర్ల వద్దకు వెళ్లి చెల్లించాలంటే కరోనా వైరస్‌ వ్యాప్తి భయానికి తోడు.. బోలెడంత సమయం వెచ్చించాలి. ఈ నేపథ్యంలో డిజిటల్‌ చెల్లింపు ప్రక్రియ క్షణాల్లో పూర్తవుతుండటం వల్ల అధికశాతం మంది ఈ మార్గాన్నే ఎంచుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

60 శాతం...

ఏప్రిల్‌ నెలలో విద్యుత్ బిల్లుల డిమాండ్‌ రూ.26.60 కోట్లు ఉండగా నెలాఖరు వరకు రూ.16.16 కోట్లు చెల్లింపులయ్యాయి. 60 శాతం ఆన్‌లైన్‌లోనే వసూలు కావడం విశేషం. కౌంటర్ల ద్వారా 40 శాతమైంది. పటాన్‌చెరు డివిజన్‌ పరిధిలోని వినియోగదారులు అత్యధికంగా 72 శాతం బిల్లులు ఆన్‌లైన్‌లోనే చెల్లించడం గమనార్హం. సంగారెడ్డిలో ఇది 51 శాతంగా ఉంది. జహీరాబాద్‌, జోగిపేట డివిజన్‌ల పరిధిలో మాత్రం ఆఫ్‌లైన్‌(కౌంటర్ల)లోనే అత్యధికంగా చెల్లింపులు చేశారు.

2019, మే బిల్లు ఈ నెలలో చెల్లించాలి...

వినియోగదారులు ఎక్కువగా ఆన్‌లైన్‌ విధానంలో చెల్లింపులకు మొగ్గు చూపుతుండటం మంచి పరిణామం. ఇలా చెల్లింపులు చేయడం సులభం. జిల్లాలో ఈ విధానంలో బిల్లులు తక్కువగా వస్తున్న ప్రాంతాలతోపాటు మండల కేంద్రాల్లో వసూలు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. మీటర్‌ రీడింగ్‌ ఈ నెలలోనూ తీయడం లేదని, మే 2019లో చెల్లించిన మొత్తాన్ని ఈనెల బిల్లుగా చెల్లించాలి.

-రవికుమార్‌, ఎస్‌ఈ

● జిల్లా వ్యాప్తంగా విద్యుత్ కనెక్షన్లు: 5,08,594

● వ్యవసాయం, వీధి దీపాలు, నీటి అవసరాల కనెక్షన్లు: 93,212

● గృహ అవసరాలవి 3.72లక్షలు

● వాణిజ్య కనెక్షన్లు : 40,118

● చిన్న, పెద్ద తరహా పరిశ్రమలవి: 3,264

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.