సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని వైకుంఠపురం ఆలయానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారిని దర్శించుకుని భక్తులకు ఆశీస్సులు తెలుపడానికి దేవనాథ జీయర్ స్వామి హాజరయ్యారు.
ఆలయంలోని ముఖ ద్వారంలో ఆలయ రాజ గోపురానికి ఆయన శిలాపూజ చేశారు. దేవుని ఆశీస్సులు భక్తులకు ఎల్లపుడూ ఉంటాయని జీయర్ స్వామి అన్నారు. ఉత్తర ద్వార ప్రవేశానికి సంబంధించిన నీతిని ఆయన భక్తులకు వివరించారు.
ఇదీ చూడండి : భద్రాద్రి ముక్కోటి ఉత్సవాలపై భక్తుల అసంతృప్తి