ETV Bharat / state

ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారు: రఘునందన్ రావు - dubbaka mla raghunandan rao road show in patancheru

అభివృద్ధిపై ప్రశ్నిస్తే అధికార పార్టీవారు దాడులకు దిగుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు డివిజన్​లో భాజపా అభ్యర్థి ఆశిశ్​ గౌడ్​కు మద్దతుగా రోడ్డు షో నిర్వహించారు.

dubbaka mla raghunandan rao campaign in ghmc elections in patancheru
ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారు: రఘునందన్ రావు
author img

By

Published : Nov 24, 2020, 5:19 AM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు డివిజన్​లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు రోడ్డు షో నిర్వహించారు. భాజపా అభ్యర్థి ఆశిశ్​ గౌడ్​కు మద్దతుగా ప్రచారం చేశారు. మంత్రి కేటీఆర్ అరాచకం కావాలా.. అభివృద్ధి కావాలని అడుగుతున్నారని.. కానీ లింగంపల్లి నుంచి పటాన్​చెరు వరకు ఎంఎంటీఎస్ పొడిగిస్తామని అధికారంలోకి వచ్చి 7 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికే రాలేదన్నారు.

పటాన్​చెరు నుంచి చిన్న వాగు మీదుగా బాహ్యవలయ రహదారి వరకు నిర్మించాలనుకున్న రహదారి నిర్మించలేదన్నారు. సిద్దిపేటలో కోమటిచెరువుకు జరిగిన అభివృద్ధి.. పటాన్​చెరులో సాకిచెరువుకు ఎందుకు జరగలేదన్నారు. ఇంటికో ఉద్యోగం అన్నారు. రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామన్నారు. ఏ ఒక్కటి అమలు కాలేదన్నారు. తెరాస ప్రభుత్వం అధికారంలో ఉండగా భైంసాలో మతఘర్షణలు రాలేదా అని ప్రశ్నించారు.

ఇదీ చదవండి: ఆరేళ్లలో భాజపా తెలంగాణకు చేసింది సున్నా : కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.