ETV Bharat / state

మద్యం తాగి పాఠశాల బస్సును నడిపిన డ్రైవర్ - సంగారెడ్డి జిల్లా

అసలు బస్సులే ఫిట్​గా ఉండడంలేదంటే... మందుబాబులు తాగి స్కూలు బస్సులు నడుపుతున్నారు. ఇలాంటి ఘటనలు చూస్తే పిలల్లను పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు ఆలోచించాల్సి వస్తోంది. మద్యం తాగి పాఠశాల బస్సు నడుపుతున్న డ్రైవర్​ను పటాన్ చెరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మద్యం తాగి పాఠశాల బస్సును నడిపిన డ్రైవర్
author img

By

Published : Jul 4, 2019, 9:49 AM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​ చెరులో నిర్వహించిన శ్వాస పరీక్షల్లో జీసస్ మేరి హైస్కూలు బస్సు డ్రైవర్ మద్యం సేవించి పట్టుబడ్డాడు. బస్సులో ఉన్న విద్యార్థులను ఇళ్ల వద్ద వదిలేందుకు మరో డ్రైవర్​ను రప్పించి వారిని పంపించారు. మద్యం తాగి వాహనాన్ని నడిపినందుకు పోలీసులు గోపాల్​ను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచనున్నట్లు ట్రాఫిక్​ సీఐ వేణుకుమార్ తెలిపారు. పిల్లలను స్కూలుకు పంపే ముందు డ్రైవర్ తాగి ఉన్నాడా లేదా అనే అంశాలపై ఆరా తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.

మద్యం తాగి పాఠశాల బస్సును నడిపిన డ్రైవర్

ఇదీ చూడండి : మైనర్ల డ్రైవింగ్​పై ప్రత్యేక నిఘా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.