కరోనా నేపథ్యంలో నూతన సంవత్సర సంబురాలను బహిరంగ ప్రదేశాల్లో జరపొద్దని... ఎవరి ఇళ్లలో వారే జరుపుకోవాలని సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు.
ఎలాంటి సభలు, ర్యాలీలు తీయవద్దని అన్నారు. చట్ట వ్యతిరేక కార్యకాలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. ప్రజలు గుంపులుగా ఉండి వేడుకలు చేసుకుంటే వైరస్ విస్తరించే అవకాశం ఉందన్నారు.
ఇదీ చదవండి: ఎంత నీరు అవసరమో చెప్పండి: కృష్ణా బోర్డు