ఆడపిల్లలు ఇంటికి అదృష్టవంతులని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. కొండాపూర్ మండలం హరిదాస్పూర్ గ్రామంలో సుకన్య సమృద్ధి ఖాతాలను తెరిపించే కార్యక్రమం నిర్వహించారు.
ఆడపిల్లలు ఉన్నవారు ఇలాంటి పథకాలు వాడుకోవాలని సూచించారు. ఇది అమ్మాయిల చదువుకు, ఇతర పనులకు నగదు జమ చేసే కార్యక్రమమని పేర్కొన్నారు.
గ్రామం ఎంతో బాగుందని.. అందరి కృషి వల్లనే ఇది సాధ్యమని అన్నారు. ఊరిలో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. భవిష్యత్లో అభివృద్ధికి మరిన్ని నిధులిచ్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: రసాభాసగా మారిన నగరపాలిక సర్వసభ్య సమావేశం