కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పట్టణంలోని సీపీఐ(ఎం) కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చట్టాలను అపహస్యం చేస్తూ.. మత కలహాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని నాయకులు ఆరోపించారు. సవరించిన పౌరసత్వ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 'ప్రత్యేక' ఆర్టీసీ ఉద్యోగులకు శిక్షణ ప్రారంభం