ETV Bharat / state

ఆ మూడు నియోజకవర్గాల్లోనే అభివృద్ధి: డీకే అరుణ - జీహెచ్​ఎంసీ ఎన్నికల న్యూస్​ 2020

గ్రేటర్​ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులకు ఓటువేయాలని డీకే అరుణ విజ్ఞప్తిచేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని సంగారెడ్డి జిల్లా భారతీనగర్​లో ఆమె ప్రచారం చేశారు. తెలంగాణలో కేసీఆర్​, కేటీఆర్​, హరీశ్​ నియోజకవర్గాల్లో మాత్రమే అభివృద్ధి జరిగిందన్నారు.

DK Aruna
ఆ మూడు నియోజకవర్గాల్లోనే అభివృద్ధి: డీకే అరుణ
author img

By

Published : Nov 26, 2020, 9:37 AM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తెరాసకు ప్రజలు బుద్ధిచెబుతారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. హైదరాబాద్ శివారు సంగారెడ్డి జిల్లా భారతీనగర్ డివిజన్​లో పార్టీ అభ్యర్థి గోదావరి అంజిరెడ్డికి మద్దతుగా ఆమె ప్రచారం చేశారు. హైదరాబాద్​ను రక్షించాలంటే కమలం పార్టీకి ఓటేయాలని ప్రజలను కోరారు.

తెలంగాణలో కేసీఆర్​, కేటీఆర్​, హరీశ్​ నియోజకవర్గాల్లోనే అభివృద్ధి జరిగిందన్నారు. భారతీనగర్​ డివిజన్​లో వరద నీటి బాధితులను ఆదుకున్నారా.. అని ప్రశ్నించారు. గత ఎన్నికల ఇచ్చిన హామీల పరిస్థితేంటని కేసీఆర్​ ప్రభుత్వాన్ని నిలదీశారు. భాజపా అభ్యర్థికి ఓటువేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఆ మూడు నియోజకవర్గాల్లోనే అభివృద్ధి: డీకే అరుణ

ఇవీచూడండి: నేడు భాజపా జీహెచ్​ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.