సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం వెలిమల తండా గ్రామంలో 434 సర్వే నంబర్లో ఉన్న ప్రభుత్వ భూముల్లో కొంతమంది అక్రమ నిర్మాణాలు చేపట్టారు. అయితే ఇది తెలుసుకున్న తహసీల్దార్ శివ కుమార్ వెంటనే పరిశీలించి అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని వీఆర్వోకు ఆదేశాలు ఇచ్చారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అతను అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. రెవెన్యూ అధికారులు కరోనా నివారణలో ఉండగా ప్రభుత్వ భూములు ఆక్రమణకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.