అసైన్డ్ భూముల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝులిపించారు. కొందరు అక్రమార్కులు లే అవుట్లు వేసి ఇళ్ల స్థలాలు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులు రావడంతో చర్యలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ శివారులోని పస్తాపూర్‌లో నిర్మించిన ఇళ్లను జేసీబీతో కూల్చేశారు.
ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే రెవెన్యూ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని జహీరాబాద్ తహసీల్దార్ నాగేశ్వరరావు హెచ్చరించారు. అధికారులు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా నిర్మాణాలు కూల్చివేయడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరును నిరసిస్తూ ఆర్డీవో కార్యాలయం, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.