సంగారెడ్డిలోని పోతరెడ్డిపల్లి పరిధిలో ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను అధికారులు కూల్చివేశారు. 155 సర్వే నంబర్ గల అసైన్డ్ భూమిలో అక్రమంగా ఇల్లు కడుతున్నారని సమాచారం అందగా... రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కట్టిన ఇళ్లు, నిర్మాణంలో ఉన్న కట్టడాలను కూల్చేశారు.
అసైన్డ్ భూమి అని తెలియక కొనుక్కున్నామని... భాధితులు తెలిపారు. కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమకు.. తక్కువ ధరకే స్థలం వస్తుందని నమ్మి కొన్నామని వాపోయారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ భూముల్లో అక్రమంగా కట్టడాలు నిర్మిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమతంగా ఉండి భూములు కొనాలని సూచించారు.