సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని అటవీ ప్రాంతంలో కుక్కల దాడిలో ఓ జింక మృతిచెందింది. అటవీ క్షేత్రంలో సంచరిస్తున్న జింకను కుక్కలు వెంటాడాయి. గమనించిన స్థానిక రైతులు.. కుక్కలను తరిమికొట్టి గాయాలపాలైన జింకను రక్షించారు. తక్షణమే నారాయణఖేడ్ అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు ఘటనాస్థలికి చేరుకునే లోపే జింక చనిపోయింది. అనంతరం పోస్టుమార్టం నిర్వహించారు.
ఇవీ చూడండి: గవర్నర్ తేనీటి విందుకు హాజరైన పలువురు ప్రముఖులు...