ETV Bharat / state

చిరుధాన్యాల ఉత్పత్తి కోసం ఆహార సార్వభౌమత్వం కార్యక్రమం - ప్రభుత్వానికి 10 డిమాండ్లతో తీర్మానం

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 23, 2023, 4:00 PM IST

Deccan Development Society Millets Program in Sangareddy : చిరుధాన్యాలు ఇప్పుడు వీటిపైన ఎక్కడ చూసిన చర్చ. కారణం కేంద్రం చిరుధాన్యాలపై ప్రత్యేక దృష్టి సారించడమే. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐరాస ప్రకటించింది. ఈ క్రమంలో ప్రజలకు చిరుధాన్యాల ఆవశ్యకతను తెలిపేలా కేంద్రం అనేక కార్యక్రమాలు చేపట్టింది.

DDS Supports Organic Millets Farming in India
Deccan Development Society Millets Program in Sangareddy
Deccan Development Society Millets Program in Sangareddy చిరుధాన్యాల ఉత్పత్తి కోసం ఆహార సార్వభౌమత్యం కార్యక్రమం - ప్రభుత్వానికి 10 డిమాండ్లతో తీర్మానం

Deccan Development Society Millets Program in Sangareddy : చిరుధాన్యాలు ప్రస్తుతం మార్కెట్‌లో వీటికి భలే గిరాకి ఉంది. ప్రజలు తమ ఆరోగ్యం దృష్ట్యా ఆహారంలో వీటిని విరివిగా తీసుకుంటున్నారు. చక్కెర వ్యాధిగ్రస్తులైతే పూర్తిగా చిరుధాన్యాలనే ఆహారంగా తీసుకుంటున్నారు. కేంద్రం చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ప్రజలకు చిరుధాన్యాల ఆవశ్యకత, ప్రయోజనాలు తెలిపేలా కేంద్రం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.

చిరుధాన్యాలతోనే మన ఆరోగ్యం సంరక్షించబడుతుంది : డా.ఖాదర్​వలీ

DDS Supports Organic Millets Farming in India : చిరుధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందో గుర్తు చేస్తూ, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఆహార సార్వభౌమత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా ఇప్పటికే కేంద్రం చిరుధాన్యాల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించింది.

ముగిసిన చిరు ధాన్యాల సదస్సు.. వినియోగంపై ప్రధాన దృష్టి..

చిరుధాన్యాల ప్రాముఖ్యత, వాటిని సాగు చేస్తున్న పేద రైతుల గుర్తింపు కోసం డీడీఎస్ దశాబ్దాలుగా పోరాటం చేస్తోంది. ఈ క్రమంలో చిరుధాన్యాల సాగును పెంచడమే లక్ష్యంగా సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, వరంగల్ జిల్లాల్లో చిరుధాన్యాల సాగు కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలతో చర్చా వేదిక నిర్వహించారు.

"2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం ప్రకటించినందుకు అన్ని స్వచ్ఛంద సంస్థలు సమావేశమయ్యాయి. ఈ సమావేశం ద్వారా చిరుధాన్యాల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, రిసెర్చ్​కు సంబంధించి అంటే ఏ కాలంకో ఏవీ ఎక్కువ పండుతాయి, వర్షాకాలంలో ఏ చిరుధాన్యాలు సాగు చేయాలి ఇలాంటి అంశాలను చర్చిస్తాము. రైతులకు మద్దతు ధర ఇవన్నింటీని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము." - రుక్మిణి రావు, డీడీఎస్ డైరెక్టర్

చిరుధాన్యాలు ఆరోగ్యానికి మేలు - మిల్లెట్స్‌తో రుచికరమైన భోజనం

గతంతో పోల్చితే చిరుధాన్యాల సాగును అన్నదాతలు బాగా తగ్గించారు. ప్రజలు ప్రధాన ఆహారంగా బియ్యాన్ని తీసుకోవడం వల్ల వరి విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. కరోనా మహమ్మారి పంజా తర్వాత ప్రజల్లో చిరుధాన్యాలు చేసే మేలుపై అవగాహన పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్‌లో వాటికున్న డిమాండ్‌ను గుర్తించి చిరుధాన్యాల సాగు పెంపు కోసం డీడీఎస్ తన వంతు సాయమందిస్తోంది.

భారత్​లో చిరుధాన్యాల సాగుపై దృష్టి సారించిన ఐసీఏఆర్​, ఐఐఎంఆర్​

Central Government On Millets Farming in India : చిరుధాన్యాలు పండించే కర్షకులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యలపై నిపుణులు చర్చించారు. 10 డిమాండ్లతో తీర్మానం రూపొందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పించనుంది. రైతులను చిరుధాన్యాలు పండించే విధంగా ప్రోత్సహించి పంటకు మద్దతు ధర కల్పించాలని డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ ప్రభుత్వాలను కోరుతోంది.

తృణధాన్యాల విత్తనాలకు పెరిగిన డిమాండ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.