ETV Bharat / state

అట్టహాసంగా పాతపంటల పండుగ - చిరుధాన్యాల సాగుపెంచాలని డీడీఎస్​ పిలుపు

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 15, 2024, 10:29 PM IST

Deccan Development Society Biodiversity Festival 2024విత్తనాలే దేవుళ్ళు, జీవవైవిద్యమే దేవాలయమనే నినాదంతో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ నిర్వహిస్తున్న పాతపంటల జాతర అట్టహాసంగా సాగుతోంది. సంక్రాంతి రోజు జాడి మల్కాపూర్‌లో 24వ సంచార జీవ వైవిద్య జాతర ప్రారంభోత్సవ సభ నిర్వహించారు. వేడుకల్లో భాగంగా సంప్రదాయ కోలాటంతో విత్తనాలను దేవుడిగా కొలుస్తూ మహిళలు ఊరేగింపుగా వచ్చారు.

DDS Patha Pantala Jathara
అట్టహాసంగా పాతపంటల పండుగ ప్రారంభం చిరుధాన్యాల సాగుపెంచాలని డీడీఎస్​ పిలుపు
అట్టహాసంగా పాతపంటల పండుగ ప్రారంభం - చిరుధాన్యాల సాగుపెంచాలని డీడీఎస్​ పిలుపు

Deccan Development Society Biodiversity Festival 2024 : జహీరాబాద్ మండలం పస్తాపూర్‌లో డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో 1999లో ఆ సంస్థ డైరెక్టర్ దివంగత పీవీ సతీశ్(DDS Sathish)​ జీవవైవిద్య సంరక్షణలో భాగంగా విత్తనాల ప్రదర్శన, ఆయుర్వేద మందుల వినియోగంపై తొలిసారిగా జాతర ప్రారంభించారు. అనంతరం చిరుధాన్యాల ప్రాధాన్యత వివరిస్తూ భారత్‌తో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ సహా పాకిస్తాన్‌లో జీవవైవిద్య జాతరలు నిర్వహించారు.

చిరుధాన్యాల ఉత్పత్తి కోసం ఆహార సార్వభౌమత్వం కార్యక్రమం - ప్రభుత్వానికి 10 డిమాండ్లతో తీర్మానం

DDS Patha Pantala Jathara : డీడీఎస్​ ఆధ్వర్యంలో 2001 నుంచి జహీరాబాద్ డివిజన్‌లోని పలు మండలాల్లో ఎద్దుల బండ్లపై విత్తనాలు ఊరేగిస్తూ నెల రోజులు చిరుధాన్యాల జాతరను నిర్వహించడం ప్రారంభించారు. మొగుడంపల్లి మండలం జాడిమల్కాపూర్‌లో ఈనెల14న మొదలైన పాతపంటల జాతర(PathaPantala Jathara) ఫిబ్రవరి 12వ తేదీ వరకు 23 గ్రామాల మీదుగా సాగనుంది. పాతపంటల ప్రదర్శనతో పాటు గ్రామీణ ప్రజల ఆహార అలవాట్లు, ఆరోగ్యంలో చిరుధాన్యాల పాత్ర, సాగు ప్రాముఖ్యతపై గ్రామసభలు నిర్వహించనున్నారు.

మొగుడంపల్లి, జహీరాబాద్, న్యాల్‌కల్, ఝరాసంగంలో జాతర ప్రదర్శన నిర్వహించి ఫిబ్రవరి 23న మాచునూర్‌లో ముగింపు సభ జరగనుంది. పాతపంటల జాతర ద్వారా ప్రజలకు చిరుధాన్యాల ప్రాముఖ్యత వివరిస్తున్నారని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాతపంటల జాతరలో భాగంగా జహీరాబాద్ డీడీఎస్​ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నేలలు, సేంద్రీయ ఎరువులు, సుస్థిరసాగుపై ఏర్పాటుచేసిన ప్రదర్శన ఆకట్టుకుంది.

మన ఆరోగ్యం మన చేతుల్లో నినాదంతో ఇంటి పరిసరాల్లో లభ్యమయ్యే ఆయుర్వేద మందులు, ఆరోగ్యానికి మేలు చేసే తీగలు, మందుల వాడకంపై ప్రదర్శన నిర్వహించి అవగాహన కల్పించారు. చిరుధాన్యాల సంరక్షణకి దశాబ్దాలుగా చేస్తున్న పోరాటం, అంతర్జాలం ద్వారా తెలుసుకున్న విషయాలను ఔత్సాహికులు అడిగి తెలుసుకున్నారు. చిరుధాన్యాల్ని కాపాడుకునేందుకు జాతరలు, జీవవైవిధ్య పండగలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

డీడీఎస్​, వాటిని ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగస్వామ్యం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తిచేసింది. జాతర ఉత్సవంలో యునెస్కో కమిటీ మీడియా ప్రతినిధి కంచన్ మాలిక్, ఆచార్య వినోద్ పావురాల, వాసుకి బెలవాడి, సీడబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మన్యం సింహ తదితరులు పాల్గొన్నారు.

"రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించాలి. చిరుధాన్యాలను పెద్దమొత్తంలో సాగు చేసేందుకు రైతులను ప్రభుత్వం ప్రోత్సహించాలి. చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కర్షకులు పండించిన చిరుధాన్యాల పంటకు మద్ధతు ధరను కల్పిస్తూ ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగం చేయాలి". - రుక్మిణి రావు, డీడీఎస్ డైరెక్టర్.

Uncultivated Leafy Vegetable Festival : 'సాగు చేయని ఆకు కూరల్లో.. పోషకాలు మెండు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.