చిరుధాన్యాల సాగు, జీవవైవిధ్యం పరిరక్షణ కోసం మూడు తరాలుగా చేస్తున్న కృషికి గానూ.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని దక్కన్ డెవలప్మెంటు సొసైటీకి ఈక్వేటర్ అవార్డు దక్కిందని ఆ సంస్థ డైరెక్టర్ సతీష్ తెలిపారు. సెప్టెంబరు 24న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ అందజేసినట్లు ఆయన తెలిపారు. 120 దేశాల నుంచి 847 దరఖాస్తులు రాగా... ఎంపికైన 20 నామినేషన్స్‌లో డీడీఎస్ చోటు దక్కిందని తెలిపారు. అవార్డు విలువ ఏడున్నర లక్షలున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇదీ చూడండి: 'రైతులందరూ రైతు బీమా పాలసీని చేయించుకోండి'