ETV Bharat / state

'ఆ రాష్ట్రాలకు తాయిలాలుగా కేంద్ర బడ్జెట్'

author img

By

Published : Feb 7, 2021, 5:48 PM IST

కేంద్రం కేవలం ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు.. తాయిలాలుగా బడ్జెట్​ను రూపొందించిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో.. పార్టీ ఆధ్వర్యంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

CPM polit buro member bv raghavulu criticized central budget
'బడ్జెట్​.. ఆ రాష్ట్రాలకు తాయిలాలుగా రూపొందింది'

మోదీ నాయకత్వంలో ప్రవేశపెట్టిన బడ్జెట్.. రాష్ట్రాల హక్కులను హరించే విధంగా ఉందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో.. పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.

రాష్ట్రాలకు రావాల్సిన హక్కుల కోసం ఉద్యమించాల్సిన దుస్థితి ఏర్పడిందని రాఘవులు పేర్కొన్నారు. కేంద్రం కేవలం ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు.. తాయిలాలుగా బడ్జెట్​ను రూపొందించిందని ఆయన విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.

అన్నదాతల పోరాటం పట్ల కేంద్రం అమానుషంగా ప్రవర్తిస్తోందని రాఘవులు మండిపడ్డారు. 73రోజుల నుంచి ఆందోళన జరుగుతున్నా.. పరిష్కారం చూపకపోవడం అన్యాయమన్నారు. రైతులతో చర్చలు జరిపి.. అందరికి ఆమోద యోగ్యంగా ఉన్న చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: బరాబర్ పదేళ్లు నేనే ముఖ్యమంత్రి.. ఊహాగానాలపై కేసీఆర్ క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.