సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గౌతంనగర్, చైతన్యనగర్, జేపీకాలనీల్లో పదికిపైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ కాలనీలను కంటైన్మెంట్ జోన్లుగా అధికారులు ప్రకటించారు.
ప్రజలు బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. గ్రేటర్ ఎంటమాలజీ సిబ్బంది కాలనీల్లో సోడియం హైపోక్లోరైట్ రసాయనాన్ని పిచికారీ చేశారు.
ఇదీ చూడండి : ఈటీవీ భారత్ స్పందన: '‘పీఎం కిసాన్’'లో తెలంగాణకు చోటు